Site icon NTV Telugu

TTD Ghee Adulteration Case: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు.. నేడు ఇద్దరిని కస్టడీకి తీసుకోనున్న సిట్!

Ttd Adulterated Ghee Case

Ttd Adulterated Ghee Case

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ వేగవంతం చేసింది. కల్తీ నెయ్యి కేసులో నేడు ఇద్దరిని సిట్ కస్టడీకి తీసుకోనుంది. సిట్‌ విచారణ కోసం 4 రోజులపాటు కస్టడీకి నెల్లూరు ఏసీబీ కోర్టు అనుమతించింది. A16 సుగంద్, A29 టీటీడీ అధికారి సుబ్రహ్మణ్యంను సిట్ అధికారులు కస్టడీ తీసుకొనున్నారు. మధ్యాహ్నం రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ‌నిర్వహిచనున్నారు. వీరిని 9 నుంచి 12 వరకు సిట్‌ విచారించనుంది. ఇద్దరి నుంచి మరిన్ని కీలక విషయాలను సిట్ రాబట్టనుంది.

Also Read: Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త!

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక నిందితుడైన A16 అజయ్ కూమార్ సుగంద్ బెయిల్ పిటిషన్‌ను నెల్లూరు ఏసీబీ కోర్టు తిరస్కరించింది. సిట్ తరపున వాదనను అసిస్టెంట్ పీపీ జయశేఖర్ బలంగా వినిపించారు. కల్తీ నెయ్యి సరఫరా దందాలో భోలే బాబా డెయిరీ ప్రతినిధులకు సహకరించిన ఆరోపణలపై సిట్‌ అధికారులు టీటీడీకి చెందిన 9 మంది అధికారులు, ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో నలుగురు రిటైర్డ్‌ కాగా, ఐదుగురు సర్వీసులో ఉన్నారు. తిరుమల లడ్డూలలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో టిటిడి ఉద్యోగులు, డెయిరీ నిపుణులు కల్తీ నెయ్యి సరఫరాకు సహకరించినట్లు తేలింది. ఐదేళ్లకు పైగా కల్తీ కొనసాగిందని, రూ. 8 కోట్లతో కొన్న రసాయనాలతో నెయ్యి తయారైనట్లు, లంచాలు తీసుకున్నారనే విషయాలు సిట్ విచారణలో వెలుగులోకి వచ్చాయి.

Exit mobile version