Site icon NTV Telugu

ఉద్యోగాల పేరుతో మోసాలు… టిటిడి కీలక ప్రకటన

తిరుపతి : ఉద్యోగాల కోసం ద‌ళారులను న‌మ్మి మోస‌పోవద్దని టిటిడి ప్రకటించింది. టిటిడిలో ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని చెప్పి డ‌బ్బులు వ‌సూలు చేసే ద‌ళారుల మాట‌లు న‌మ్మి మోస‌పోవ‌ద్దని ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది టిటిడి. ఎంఆర్‌.శ‌ర‌వ‌ణ‌, సుంద‌ర‌దాస్ అనే వ్యక్తులు తాము టిటిడి సిబ్బంది అని చెప్పి… ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని 15 మంది నిరుద్యోగులను మోసం చేశారని తెలిపిన టిటిడి… ఈ విషయం బయటకు రావడంతో టీటీడీ విజిలెన్స్ విభాగం ఫిర్యాదు చేసిందని పేర్కొంది.

read also : విశాఖ జిల్లాలో అపశృతి..ఫ్లైఓవర్‌ కూలి ఇద్దరు మృతి

ఈ ఫిర్యాదు మేరకు తిరుప‌తి ఈస్ట్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు నమోదైందని తెలిపింది. టిటిడిలో ఉద్యోగాల భ‌ర్తీ ప్రక్రియ చేప‌ట్టేట‌ప్పు‌డు ముందుగా ప‌త్రిక‌ల్లో, టిటిడి వెబ్‌సైట్‌లో అధికారిక ప్రక‌ట‌న (నోటిఫికేషన్ ‌) ఇస్తామని ప్రకటించింది టిటిడి. ఎవరైనా డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించడం పూర్తిగా అసాధ్యమని… ఇలాంటి విషయాలపై టిటిడి గతంలో కూడా ప్రజలకు స్పష్టంగా వివరించిందని తెలిపింది.

Exit mobile version