తిరుమల : రేపటి నుంచి ఆన్ లైన్ లో సర్వదర్శన టోకేన్లు జారీ చేస్తామని టీటీడీ బోర్డు స్పష్టం చేసింది. సెప్టంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వ తేదీ లకు సంబంధించిన టికెట్లను విడుదల చేస్తున్నామని తెలిపింది. రోజుకి 8 వేల చొప్పున టిక్కెట్లు విడుదల చేస్తూన్నామని.. దర్శనానికి విచ్చేసే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా కరోనా నెగటివ్ రిపోర్టు చూపించాలని సూచనలు చేసింది. 26 తేదీ నుంచి తిరుపతి లో ఆఫ్ లైన్ లో జారి చేస్తున్న టోకెన్లు నిలిపివేస్తూన్నామని ప్రకటించింది. 24 వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో అక్టోబర్ మాసం కు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విడుదల చేస్తామని పేర్కొంది టీటీడీ.