Site icon NTV Telugu

Tirumala Tickets: ఉదయాస్తమాన సేవా టికెట్లు విడుదల

తిరుమలకు భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో భక్తులు ఏడుకొండల స్వామి దర్శనానికి పోటెత్తుతున్నారు. నిన్న 31 వేల మందికి పైగా భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదిలా వుంటే టీటీడీ ఉదయాస్తమాన సేవా టికెట్లు విడుదల చేసింది టీటీడీ. తిరుపతిలో చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి విరాళమిచ్చిన దాతలకు ప్రివిలేజ్ గా ఉదయాస్తమాన సేవా టికెట్ల కేటాయించింది.

https://ntvtelugu.com/nandamuri-family-members-meets-ap-cm-jagan/

అర్ధగంటలో చిన్న పిల్లల ఆసుపత్రికి రూ.58 కోట్ల విరాళం వచ్చింది. టీటీడీ వెబ్ సైట్ లో కొనసాగుతోంది విరాళాల ప్రక్రియ. 28 శుక్రవారం ఉదయాస్తమాన టికెట్లు, 503 సాధారణ రోజుల ఉదయాస్తమాన టికెట్లు అందుబాటులో ఉంచింది టీటీడీ. రూ.కోటి చెల్లించిన వారికి సాధారణ రోజుల్లో, రూ.1.50 కోట్లు చెల్లించిన వారికి శుక్రవారం ఉదయాస్తమాన టికెట్లు కేటాయించింది. ఇప్పటికే 24 శుక్రవారం ఉదయాస్తమాన టికెట్లు, 22 సాధారణ రోజుల ఉదయాస్తమాన టికెట్లు బుక్ చేసుకున్నారు భక్తులు.

Exit mobile version