Site icon NTV Telugu

Tirumala: టీటీడీ కీలక నిర్ణయం .. అప్పుడు సర్వదర్శన భక్తులకే అనుమతి

Ttd Dharmareddy

Ttd Dharmareddy

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. జిల్లా యంత్రాంగంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు ఈవో ధర్మారెడ్డి. బ్రహ్మోత్సవాల నేపధ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. బ్రహ్మోత్సవాలు జరిగి సెప్టంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేది వరకు సర్వదర్శన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తాం అన్నారు ఈవో ధర్మారెడ్డి. సామాన్య భక్తులుకు ప్రాధాన్యత ఇచ్చేందుకే కీలక నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. సెప్టెంబర్ 27వ తేదీన ధ్వజారోహణం సందర్భంగా శ్రీవారికి రాష్ర్ట ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

అక్టోబర్ 1వ తేదిన గరుడ వాహనం,5వ తేదిన చక్రస్నానం కార్యక్రమం. బ్రహ్మోత్సవాలు జరిగే తోమ్మిది రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసాం. అక్టోబర్ 1వ తేదీన గరుడసేవ సందర్భంగా ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు అనుమతించం అన్నారు. వాహన సేవలు ఉదయం 8 గంటలకు ….రాత్రి 7 గంటలకు నిర్వహిస్తాం అని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. మరోవైపు తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. రోజూ 70 నుంచి 80 వేలమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.నిన్న శ్రీవారిని 73,375 మంది భక్తులు దర్శించుకున్నారు. త లనీలాలు సమర్పించిన భక్తులు 31,117 మంది. హుండీ ఆదాయం రూ.4.71 కోట్లుగా టీటీడీ తెలిపింది.
Andhra Pradesh Liquor Licence: ఏపీకి బార్‌ల అప్లికేషన్ల ద్వారా భారీ ఆదాయం!

Exit mobile version