Site icon NTV Telugu

నేడు టీటీడీ పాలకమండలి సమావేశంలో 85 అంశాలపై చర్చ..

ఇవాళ జరగబోయే సమావేశంలో 85 అంశాలు పై చర్చించనుంది టీటీడీ పాలకమండలి. టెబుల్ అజేండగా మరిన్ని అంశాలు వచ్చే అవకాశం ఉంది. శ్రీవారి ఆలయంలో దర్శనాల పెంపు పై నిర్ణయం తీసుకోనున్న పాలకమండలి… గరుడ వారధిని అలిపిరి వరకు నిర్మించేందుకు ప్రతిపాదనలు తేనుంది. వరాహస్వామి ఆలయ గర్బాలయ వాకిలికి దాత సహాయంతో 180 కేజిల వెండితో తాపడం పనులపై నిర్ణయం తీసుకోనున్నారు.తిరుపతి ఆలయంలో పుష్పకైంకర్యానికి వినియోగించే పుష్పాలతో అగరబత్తుల తయ్యారికి ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. తిరుమలలో మూడో దశలో 1389 సిసి కెమెరాలు ఏర్పాటుకు టెండర్లు ఖరారు చేయనున్నారు.

Read Also : యువతి నెంబర్ ఇవ్వలేదని యువకుడి కాల్పులు…

ఇక ధార్మిక ప్రచారంలో భాగంగా కళ్యాణమస్తూ,ఎస్సి ఎస్టి బిసి కాలనీలో 500 ఆలయాలు నిర్మాణం త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. హౌసింగ్ సొసైటీ నిబంధనల మేరకు ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించనున్నారు. హిందూ దేవాలయాలకు ఇచ్చే విగ్రహాలు కేటాయింపు సబ్సిడీ 3లక్షలకు తగ్గించాలని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. టీటీడీ విద్యాసంస్థలలో చదువుకునే హాస్టల్ విద్యార్థులకు ఉచితంగా ఆహారం పంపిణీ చేయనున్నారు. టీటీడీ అస్పత్రులలో మందులు కొనుగోళ్లు.. టీటీడీలోని పలు విభాగాలలో తాత్కాలిక పోస్టులను శాశ్వత పోస్టులుగా గుర్తించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏటీసీ,వరాహస్వామి అతిధి గృహం,ఉద్యోగుల కాటేజీలు ఆధునికరణ… కాకులమాను కొండ వద్ద వున్న విండ్ పవర్ ను 10ఏళ్ళు పాటు ఉచితంగా మైంటైన్స్ కు గ్రీంకో ఎనరజిస్ కు కేటాయించనున్నారు.

కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం మండలం వడ్డపల్లెలోని వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద అమినిటీస్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నారు. 25ఏళ్ళు పాటు సోలార్ విద్యుత్ కొనుగోలుకు ఎన్టిపీసీతో ఎంవోయూ… మొదటి ఘాట్ రోడ్డులోని 57వ మలుపు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా శిలాతోరణం వరకు సేఫ్టీ మెష్ ఏర్పాటు. చేయనున్నారు. 2.9 కోట్ల శ్రీవాణి ట్రస్ట్ నిధులతో పేరూరులోని వకుళమాత ఆలయం వద్ద ప్రహరీ నిర్మాణంతో పాటుగా శ్రీనివాసం,విష్ణునివాసం,శ్రీవారి మెట్టు వద్ద శివశక్తీ డైరీ పార్లర్ కు దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. 108,104 సర్వీస్ సంస్థయినా ఆరబిందో కు శ్రీనివాసం,శ్రీదేవి కాంప్లెక్స్ లలో నామినల్ అద్దెకు గదులు కేటాయించనున్నారు. తిరుమల మినహా టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాలకు విష్ణుభట్టాచార్యులను వైఖానస ఆగమ అడ్వైసర్ గా అలాగే టీటీడీ పరిధిలోని ఆలయాలలో చనిపోయ్యిన అర్చకుల స్థానంలో నూతన అర్చకుల నియామకం మరియు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులతో పాటు పలువురు అర్చకులు సర్వీస్ రెగ్యులరైజషన్ చేయనున్నారు. ఇక భారీగా నెయ్యి, ముడిసరుకులు కొనుగోలకు ఆమోదం అలాగే తిరుమలలోని పలు మఠాలు క్రమబద్దికరణతో పాటు లీజు కాలపరిమితి పొడిగింపుపై నిర్ణయామ్ తీసుకోనున్నారు.

Exit mobile version