ఎల్లుండి టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. 20 వ తేదిన భోగశ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్రకళషాభిషేకం చేయనున్నారు ఆలయ అధికారులు. 21వ తేదికి ప్రస్తుత పాలకమండలి గడువు ముగియనుంది. 22వ తేది నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. 24వ తేదిన వర్చువల్ ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ. ఇక నిన్న శ్రీవారిని 14116 మంది భక్తులు దర్శించుకున్నారు. 5842 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా … హుండి ఆదాయం 1.1 కోట్లు ఉంది.