NTV Telugu Site icon

భక్తులకు గుడ్ న్యూస్… త్వరలో ఆఫ్ లైన్లో సర్వదర్శన టోకెన్లు

కోవిడ్ కారణంగా తిరుమలకు వెళ్ళే భక్తులు తగ్గారు. ఇప్పుడిప్పుడే వారి సంఖ్య పెరుగుతోంది. సామాన్య భక్తులుకు ప్రాధాన్యత ఇచ్చేలా త్వరలోనే ఆఫ్ లైన్ ద్వారా టోకేన్లు జారీ ప్రకియ ప్రారంభిస్తాం అని టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ కారణంగా విధిలేని పరిస్థితిలో ఆన్ లైన్ ద్వారా ప్రస్తుతం సర్వదర్శన టోకేన్లు జారీ చేస్తున్నాం అన్నారు.

కోవిడ్ వ్యాప్తి చెందుతుంది అన్న ఆందోళనతో తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా టోకేన్లు జారి చేసే విధానాన్ని గత ఏడాది సెప్టంబర్ 25 నుంచి రద్దు చేసాం అని తెలిపారు. ఆన్ లైన్ లో సర్వదర్శన టోకేన్లు జారి చేస్తున్నా ..గ్రామీణ ప్రాంతంలో వున్న సామాన్య భక్తులకు దర్శన టోకేన్లు అందడం లేదన్న భావనలో టీటీడీ వుందన్నారు.

ఎప్పటికప్పుడు తిరుపతిలో ఆఫ్ లైన్ విధానంలో సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా వుండేలా సర్వదర్శన టోకెన్లు జారీచెయ్యాలని భావిస్తున్నా అన్నారు. కోవిడ్ తీవ్రత కారణంగా వాయుదా వేస్తూ వస్తూన్నాం

ఫిబ్రవరి 15కి ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం పడుతుంది అన్న నిపుణులు సూచన మేరకు ….ప్రస్తుతం ఆన్ లైన్ లో ఫిబ్రవరి 15 వరకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు మాత్రమే జారీచేస్తున్నాం అన్నారు. ఫిబ్రవరి 15న పరిస్థితి అంచనా వేసి సర్వదర్శనం టోకెన్లు సామాన్య భక్తులకు సులభతరంగా అందేలా ఆఫ్ లైన్ విధానంలో జారీచేసే అంశంపై నిర్ణయం తీసుకుంటాం అన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.