NTV Telugu Site icon

తిరుమల ఘాట్ రోడ్డులో ఈవో తనిఖీలు

భారీవర్షాల కారణంగా తిరుమలకు రాకపోకలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో తిరుమల ఘాట్ రోడ్డులో తనిఖీలు నిర్వహించారు ఇఓ జవహర్ రెడ్డి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. సోషల్ మీడియా సమాచారం విశ్వసించవద్దని, వర్షం వల్ల దర్శనానికి రాలేకపోతే.. తర్వాత దర్శించుకునే అవకాశం ఇస్తామన్నారు జవహర్ రెడ్డి.

భక్తులకు ఇబ్బందులు కలగకుండా తిరుమలలో భక్తులకు అన్నప్రసాద సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. తిరుపతిలో భక్తులకు వసతి సౌకర్యం కల్పించామని, వర్షం కారణంగా దర్శనానికి రాలేని భక్తులను తరువాత రోజులలో దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు తొలగింపు తరువాత భక్తులను అనుమతిస్తాం అన్నారు జవహర్ రెడ్డి.

ఇదిలా వుంటే.. అలిపిరి మార్గంలో రాకపోకలు ప్రారంభం అయ్యాయి. కార్లను మాత్రమే కొండ పైకి అనుమతిస్తున్నారు అధికారులు. అలిపిరి మార్గంలో కొండ చరియలు విరిగిపడడంతో ఉదయం నుండి రాకపోకలను నిలిపివేశారు అధికారులు. విరిగిపడిన బండ రాళ్లను తొలగించి వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు అధికారులు.