TTD Crucial Decisions: అలిపిరి నడక మార్గంలో దర్శనానికి వెళుతున్న బాలుడిపై చిరుత దాడి చేసిన నేపథ్యంలో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈరోజు చిరుత దాడి చేసిన ప్రాంతాన్ని శుక్రవారం టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. దాడి చేసింది పిల్ల చిరుత కావడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పిందన్న ఈవో దాడి జరిగిన సమయంలో భక్తులు పెద్దగా అరవడం, రిపీటర్ స్టేషన్ నుంచి లైట్లు వేయడంతో చిరుత బాలుడిని వదిలేసి వెళ్లి పోయిందని అటవీశాఖ అధికారులు చిరుత సంచారాన్ని గుర్తించారని, అలిపిరి గాలిగోపురం నుంచి నరసింహస్వామి గుడి వరకు చిరుత సంచరిస్తున్నట్టుగా తెలిసిందని అన్నారు.
IND vs WI: వెస్టిండీస్ టూర్ కి ఇండియన్ టీం ప్రకటన.. ఫుల్ డీటైల్స్ ఇవే!
చిరుత దాడిలో గాయపడిన బాలుడు కౌశిక్ తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఐసీయూలో చికిత్స పొందుతున్న క్రమంలో టీటీడీ చైర్ మెన్ సుబ్బారెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సాక్షాత్తూ శ్రీవేంకటేశ్వరస్వామి బాలుడి ప్రాణాలు కాపాడారని, ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదని, మరింత మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. శ్రీవారి మెట్టు, అలిపిరి నడక మార్గాల్లో వన్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా రెండు వైపులా కంచె ఏర్పాటు చేస్తామని అటవీశాఖ నిబంధనల వలన చేయలేకుంటే అలిపిరి నడక మార్గంలో భక్తులను రాత్రి వేళలో అనుమతించే అంశంపై పునరాలోచిస్తామన్నారు.
TTD: అలిపిరి నడక మార్గంలో చిరుత దాడి.. కీలక చర్యలు చేపట్టిన టీటీడీ
Show comments