తిరుపతి : చంద్రబాబు కుప్పం పర్యటన పై మండిపడ్డారు టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి. అరాచకాలు చేసే సంప్రదాయం వైసీపీకి లేదని..అలాగే తమ అధికారులకు కూడా అలాంటి ప్రవర్తన లేదన్నారు… అమరావతి లో ఏ విధంగా బూతులు తిట్టి, దాడులు చేయించుకుని , ఢిల్లీ వరకు రంకెలు వేసారో.. ప్రజలు గమనిస్తున్నారని చురకలు అంటించారు.
ఢిల్లీ వెళ్లి పర్యటన కు వెళ్లి రాష్ట్రపతి పాలన కావాలని కోరారని… కుర్చీ లేకపోతే చంద్రబాబు ఉండలేక పోతున్నాడని మండిపడ్డారు. జలసి, ఈర్శ్య తో చంద్రబాబు ఉన్నారని…. త్వరలోనే మరోసారి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలతో శాశ్వతంగా… ఆయన సీఎంగా ఉంటారనే భయంతో చంద్రబాబు అలా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రజలు బుద్ధి చెప్పారు..మరల బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి.
