Site icon NTV Telugu

కరోనా ఎఫెక్ట్.. ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు..

TTD

TTD

కరోనా సెకండ్‌ వేవ్‌ పూర్తిస్థాయిలో అదుపులోకి రానేలేదు.. మరోవైపు కరోనా థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. థర్డ్‌ వేవ్‌పై రకరకాల అంచనాలున్నాయి.. అయితే.. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు కారణంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతమగానే నిర్వహించాలని నిర్ణయించింది టీటీడీ.. ఈ విషయాన్ని వెల్లడించారు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.. ఇక, మరో వారంరోజులలో ఆన్‌లైన్‌లో సర్వదర్శన టోకెన్ల జారీని ప్రారంభిస్తామన్న ఆయన.. మరోవైపు.. అన్నమయ్య కీర్తనలకు బహుళ ప్రచారం కల్పిస్తాం అన్నారు.. అన్నమయ్య కీర్తనలు అన్నింటికి ప్రాచుర్యం కల్పించడానికి అదివో అల్లదివో పాటల పోటీ కార్యక్రమాని ప్రారంభిస్తున్నామని తెలిపారు.. 15 నుంచి 25 సంవత్సరాల వయ్ససు కలిగినవారు ఈ పాటల పోటీల్లో పాల్గొనవచ్చన్న ఆయన.. జిల్లా స్థాయిలో ప్రారంభించి రాష్ర్ట స్థాయిలో కూడా ఈ పోటీ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.

Exit mobile version