ఆనందయ్య మందు పై పరిశోధన వేగవంతం చేసారు తిరుపతి ఆయుర్వేద వైద్యులు. 18 మంది వైద్యులు, 32 మంది పిజి విధ్యార్దులుతో పరిశోధన జరుపుతున్నాం అని ఆయుర్వేద ప్రిన్సిపాల్ మురళిక్రిష్ణా తెలిపారు. సిసిఆర్ఏఏస్ ఆదేశాలు మేరకు మందు వేసుకున్న 500 మంది వివరాలు సేకరిస్తూన్నాం. విజయవాడ, తిరుపతి కేంద్రంగా పరిశోధన జరుగుతుంది. ఏక్కువ మంది ముందస్తూగా మందును వేసుకున్నారు. అదనంగా మరో 200 మంది వివరాలను అందించాలని జిల్లా యంత్రాగాని కోరాం. ఇవాళ రాత్రికి సిసిఆర్ఏఏస్ కి పరిశోధన నివేదిక సమర్పిస్తాం అని తెలిపారు. మరో రెండు, మూడు రోజులలో పూర్తి స్థాయిలో పరిశీలన జరిపిన అనంతరం సిసిఆర్ఏఏస్ నివేదిక సమర్పిస్తుంది అని పేర్కొన్నారు.