రైల్వే ప్రయాణికులు అప్రమత్తం కావాల్సిన సమయం.. నిర్వహణ పనులు దృష్ట్యా ఇవాళ్టి నుంచి ఈ నెల 20 వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది… ముఖ్యంగా విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేశారు అధికాఉలు.. వాటిలో.. కాకినాడ- విశాఖపట్టణం, కాకినాడ-విజయవాడ, విజయవాడ-గుంటూరు, గుంటూరు-తెనాలి, విజయవాడ-గుంటూరు, గుంటూరు-రేపల్లె, రేపల్లె-తెనాలి, తెనాలి-గుంటూరు, గుంటూరు-విజయవాడ, విజయవాడ-గుంటూరు, గుంటూరు-విజయవాడ, తెనాలి-రేపల్లె, రేపల్లె-మార్కాపురం, మార్కాపురం-తెనాలి, తెనాలి-విజయవాడ రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్టు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..
Read Also: Andhra Pradesh Crime: రూ.500 కోసం ప్రియుడి ప్రాణాలు తీసిన ప్రియురాలు..!
గుంటూరు-మాచర్ల మధ్య నడిచే రైళ్లను గుంటూరు-నడికుడి మధ్య రద్దు చేశారు. అలాగే, విజయవాడ-మాచర్ల రైళ్లను విజయవాడ-నడికుడి మధ్య కూడా రద్దు చేసినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ఆపరేషనల్ సమస్యల కారణంగా గుంటూరు మీదుగా నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు డివిజనల్ రైల్వే తెలిపింది. ఈ రైళ్ల రద్దు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనుంది.. ఇక, విజయవాడ- కొండపల్లి మధ్య మూడో రైలు మార్గం నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దాంతో కొన్ని గూడ్స్ రైళ్లను మోటుమర్రి-విష్ణుపురం మీదగా నడికుడి మార్గంలో మళ్లిస్తున్నారు. ఫలితంగా 6 రోజుల పాటు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు అధికారులు.
