NTV Telugu Site icon

Vizag Tragedy:ఎండాడలో విషాదం.. అపార్ట్ మెంట్ నుంచి పడి విద్యార్ది మృతి

student died

4e54d4ad A62d 4c90 9ac5 C11a43f463a8

విశాఖ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎండాడ లోని వైశాఖి స్కైలైన్ లో ఘోరం జరిగింది. అపార్ట్మెంట్ పై నుంచి పడి గోగినేని గిరితేజ అనే మెడికల్ విద్యార్థి మృతి చెందాడు. గోగినేని గిరితేజ ఎంబిబిఎస్ ద్వితీయ సంవత్సరం గీతంలో చదువుతున్నాడు. బి 4 బ్లాక్ లో అపార్ట్మెంట్ పైనుండి కిందపడి పోయాడు యువకుడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు విద్యార్థి గిరితేజ. సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు ఆరిలోవ పోలీసులు. మృతుడు సీతమ్మధార వాసిగా గుర్తించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు అన్వేషిస్తున్నారు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మైలవరం జలాశయంలో దూకి…
జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం జలాశయం వద్ద విషాదం చోటుచేసుకుంది. వేపరాల గ్రామానికి చెందిన గోవర్ధన్ ,లక్ష్మీదేవి దంపతులు ఈరోజు ఉదయం తమ ఇద్దరి పిల్లలతో కలిసి మైలవరం జలాశయం వద్దకు వచ్చి పిల్లలు ఇద్దరినీ జలాశయం గట్టుపై ఉంచి భార్యాభర్తలు ఇద్దరు జలాశయంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు గోవర్ధన్ బంధువులు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడ్డ భార్యాభర్తలు ఇద్దరి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

మిర్జాపూర్ లో కార్డన్ సెర్చ్
ఈమధ్యకాలంలో అనుమానిత వ్యక్తులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. నిర్మల్ జిల్లా బైంసా మండలం మిర్జాపూర్ గ్రామంలో పోలీసులు కాంట్రాక్ట్ కమ్యూనిటీ ప్రోగ్రాం కార్డన్ సెర్చ్ నిర్వహించారు .ఎలాంటి అనుమతి పత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు 7 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత వ్యక్తులు సంచరిస్తే నేరుగా పోలీసులను ఆశ్రయించాలని కోరారు.

Read Also: China-Taiwan Conflict: తైవాన్ సరిహద్దుల్లో చైనా యుద్ధవిన్యాసాలు.. ఆక్రమణే లక్ష్యమా..?

Show comments