విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలవుదీరిన కనకదుర్గమ్మను దర్శించేందుకు వెళుతున్న భక్తులకు అధికారులు పలు సూచనలు చేశారు. ఇంద్రకీలాద్రి పలు ప్రాంతాల్లో పనులు చేపట్టనున్న నేపథ్యంలో.. ఘాట్‌రోడ్డుపై రాళ్లు జారిపడే అవకాశం ఉండటంతో కొండపైకి వచ్చే వాహనాలను ఆంక్షలు విధించారు. కొండపైకి వాహనాల్లో వెళ్లాలనుకునే భక్తులు అర్జున వీధి నుంచి అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
అంతేకాకుండా మూడు రోజుల పాటు పనులు కొనసాగనున్న క్రమంలో ఘాట్ రోడ్డుపైకి వాహనాల అనుమతించబడవని అధికారులు వెల్లడించారు. అలాగే కార్తీకమాసం సందర్భంగా దీపావళి రోజున సాయంత్రం 6 గంటల వరకే దర్శనానికి అనుమతులు ఇస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.