NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్..

గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన పలు కామెంట్స్ చేసాడు. గడిచిన 5 ఏళ్లు గా వైసిపి పాలనలో రూరల్, అర్బన్ ప్రాంతాల్లో ఎలాంటి మౌలిక సౌకర్యాలు కల్పించలేకపోయారని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో గుంటూరు నగరంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని., ఆగిపోయిన అభివృద్ధి పనులపై సమీక్ష చేశామన్నారు. తాగునీరు సరఫరా, అండర్ డ్రైనేజీ పనులకు కేటాయించిన సొమ్మును గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని., నిధులు లేకపోవడం వల్లే గుంటూరు పట్టణంలో తాగునీరు కొరత, అండర్ డ్రైనేజీ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోవడం జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. గుంటూరు ప్రాంతంలో ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు కూడా నిధులు లేని పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో గుంటూరు నగరాన్ని అభివృద్ధికి కేరాఫ్ గా మారుస్తామని., నిధులు సమీకరణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గుంటూరు ప్రాంత అభివృద్ధిపై ప్రతి వారం రోజులకు ఒకసారి సమీక్ష జరుపుతామని ఈ సభలో ఆయన పేర్కొన్నారు.

ప్రమాద రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే నా లక్ష్యం.. మంత్రి రాం ప్రసాద్ రెడ్డి

ప్రమాద రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే నా లక్ష్యం అన్నారు ఏపీ రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి. నా 11 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదంలో నా తండ్రిని కోల్పోయా.. ప్రమాదాల్లో కుటుంబ సభ్యుడిని కోల్పోతే ఆ కుటుంబం పడే బాధ ఏంటో నాకు తెలుసు. నాకు వచ్చిన దుఃఖం ఏ కుటుంబానికీ రాకూడదు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏం చర్యలు తీసుకోవాలో కచ్చితంగా తీసుకుంటాం. మహిళల కళ్లల్లో ఆనందం చూసేందుకే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సదుపాయం కల్పించాలని నిర్ణయం. పొరుగు రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న తీరు పై ముందుగా అధ్యయనం చేస్తాం. అక్కడి లోటు పాట్లు లేకుండా ఎవరికీ కష్టం రాకుండా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తాం. శారీరకంగా మానసికంగా దృడంగా ఉండాలంటే అందరికీ క్రీడలు చాలా అవసరం. ప్రతి ఒక్కరికీ క్రీడలను చేరువ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.

మియాపూర్, చందనగర్ పరిధిలో 144 సెక్షన్

మియాపూర్, చందనగర్ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉందని సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంటీ అన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి వచ్చిన వారిని ఖాళీ చేయించామన్నారు. నిన్న పోలీసులపై కొంత మంది రాళ్లు విసిరారని తెలిపారు. లా అండ్ ఆర్డర్ తప్పేలా ….వ్యవహరించారని మండిపడ్డారు. వారిపై కేస్ లు నమోదు చేసామన్నారు. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకోవచ్చు అని ప్రజలను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. దీనికి వెనుక ఉన్న వారిపై కేస్ లు నమోదు చేశామన్నారు. ప్రభుత్వ భూమి కాబట్టి నేటి నుండి ప్రత్యేక భద్రత ను ఏర్పాటు చేసామన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించు కోవచ్చు అని వచ్చే వదంతులు నమ్మవద్దన్నారు. దాదాపు వెయ్యి మంది ఫోర్స్ ని ల్యాండ్ దగ్గర పెట్టామన్నారు. ఈ పరిసరాల్లో అనుమానస్పదం గా తిరిగితే అరెస్ట్ లు ఉంటాయని తెలిపారు. దీంతో మియాపూర్ లోని సర్వే నెంబర్ 100, 101 వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

మంత్రి పొన్నంపై ఆరోపణలు.. పాడి కౌశిక్ రెడ్డికి లీగల్‌ నోటీసులు..

ఫ్లై యాష్ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిరాధార ఆరోపణలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, పలు న్యూస్ ఛానెల్స్, పత్రిక లకు లీగల్ నోటీసులను అడ్వకేట్ ఈటోరు పూర్ణచందర్ రావు జారీ చేశారు. ఫ్లై యాష్ అనేది ఎన్టీపీసీ నుండి ఉత్పత్తి అవుతుంది..అది వినియోగించుకోవడానికి వీలుండదన్నారు. దీనిని టెండర్ల ప్రక్రియ ద్వారా ఉచితంగా సప్లై చేస్తారన్నారు. ఈ ఫ్లే యాష్ ను రోడ్ల నిర్మాణానికి ,బ్రిక్స్ తయారీ కి ఉపయోగిస్తారని తెలిపారు. ఈ ఫ్లై యాష్ రామగుండం నుండి వివిధ ప్రాంతాలకు వెళ్తుందన్నారు. ఈ లారీలలో ఎంత ఫ్లై యష్ పోతుంది అనేది అన్లోడ్ ఎన్టీపీసీ మాత్రమే చూసుకుంటుందన్నారు. ఫ్లై యాష్ ఎక్కడ లోడింగ్ అవుతుందో అక్కడ అడగల్సింది పోయి హుజురాబాద్ లో కౌశిక్ లారీలను ఆపి మంత్రి గారిపై ఆరోపణలు చేశారని తెలిపారు.

వైరల్ అవుతున్న ఎన్టీఆర్ చిన్నప్పటి వీడియో.. ఎంత క్యూట్ గా వున్నాడో..

నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయిన జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు.చిన్న వయసులోనే ఊహించని స్థాయిలో మాస్ ఇమేజ్ అందుకొని ఎన్నో రికార్డ్స్ తిరగరాశారు .తన నటనతో ,డాన్స్ తో ఎన్టీఆర్ ఎంతగానో మెప్పిస్తూ వస్తున్నారు.యాక్టర్ గా ,డాన్సర్ గా ,సింగర్ గా మల్టీ టాలెంట్ తో ఎన్టీఆర్ దూసుకుపోతున్నారు.పేజీలకు పేజీలు డైలాగ్స్ కూడా సింగల్ టేక్ లో చెప్పగల నటనాచాతుర్యం ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యం.అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ గ్లోబల్ స్థాయికి చేరింది.ఆ సినిమాలో ఎన్టీఆర్ తన నటనతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నారు.దేవర సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి ,కొడుకుగా డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు.మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ చిన్నప్పటి వీడియో బాగా వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ చిన్నప్పుడు యూరోపియన్ తెలుగు అసోసియేషన్ ఈవెంట్ లో పాల్గొన్నాడు.ఆ ఈవెంట్లో సీనియర్ నటి శారద పక్కన ఎన్టీఆర్ కూర్చొని మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతుంది.ఆ వీడియోలో ఎన్టీఆర్ నిక్కర్ వేసుకొని కనిపించాడు.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

విమానానికి బాంబు బెదిరింపు.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

కొద్ది రోజుల క్రితం చెన్నై నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భారతదేశంలోని 41 విమానాశ్రయాలకు ఈమెయిల్ ద్వారా ఇలాంటి తప్పుడు బాంబు బెదిరింపులు వచ్చాయి. జూన్ 18న ఇండిగో ఎయిర్‌లైన్స్ కస్టమర్ సర్వీస్ సెంటర్ చాట్‌లో ఒక వ్యక్తి చెన్నై నుండి ముంబైకి వెళ్లే విమానంలో బాంబు పెడతానని బెదిరించాడు. ఆ తర్వాత విమానాశ్రయంలో భద్రతను పెంచారు.. దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే దర్యాప్తులో ఎటువంటి పేలుడు పదార్థాలు కనిపించలేదు.

దీక్షకు దిగిన మంత్రి అతిషి.. ఢిల్లీకి హర్యానా మరింత నీటిని తగ్గించిదని ఆప్ ఆరోపణ

ఢిల్లీలో నీటి కొరతపై నీటి శాఖ మంత్రి అతిషి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆమె నిరాహార దీక్ష చేపట్టి నేటికి మూడో రోజు. అతిషి మూడో రోజు వీడియో సందేశాన్ని విడుదల చేసింది. ఢిల్లీలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నందునే నేను ఈ నిరాహార దీక్షకు కూర్చున్నానన్నారు. ఢిల్లీలో మనకు నీళ్లు లేవు. ఢిల్లీకి వచ్చే నీరంతా పక్క రాష్ట్రాల నుంచి వస్తుంది. ఢిల్లీకి నీళ్లు వచ్చే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామన్నారు. ఢిల్లీలో మొత్తం నీరు 1005 ఎంజీడీ అని, అందులో 613 ఎంజీడీ (రోజుకు మిలియన్ గ్యాలన్లు) హర్యానా నుండి వస్తుందని, అయితే గత 3 వారాలుగా హర్యానా తన నీటిని మరింత తగ్గించిందని అతిషి చెప్పారు. ఢిల్లీకి నీళ్లు ఇవ్వడం లేదు. మాకే నీళ్లు లేవని హర్యానా ప్రభుత్వం చెబుతోంది కానీ నిన్న కొంతమంది హథిని కుండ్ బ్యారేజీ వద్దకు వెళ్లి హథిని కుండ్ బ్యారేజీలో నీళ్లు ఉన్నాయని చూపించారు.

విజయ్ ‘ది గోట్ ‘ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్..

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది గోట్ (The Greatest OF All Time ). ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై కల్పతి ఎస్ అఘోరం ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాలో ప్రశాంత్‌, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్‌, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్సె ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే శనివారం దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం నుండి పవర్ఫుల్ గ్లింప్స్ ను విడుదల చేసారు.డైలాగ్స్ లేకుండా కేవలం యాక్షన్ సీక్వెన్స్ తో కూడిన గ్లింప్సె రిలీజ్ చేయగా మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ అయిన ‘చిన్నచిన్నకంగాళ్’ అనే సాంగ్‌ను విడుదల చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్ సాగే ఈ పాటను కబిలన్ వైరముత్తు రచించగా విజయ్‌తో పాటు యువన్ శంకర్ రాజా, రాజా భవతరిని కలిసి పాడారు.ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్సె లో ఓల్డ్ లుక్ లో ,అలాగే యంగ్ లుక్ లో కనిపించి అదరగొట్టాడు.