Today Events November 17, 2022
*ఇవాళ పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పై సీఎం జగన్ సమీక్ష.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం
* కర్నూలులో నేడు 2వ రోజు చంద్రబాబు పర్యటన.. ఆదోని, ఎమ్మిగనూరులో రోడ్ షో , బహిరంగ సభ. కర్నూలులో రాత్రి బస
* విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలో నేడు పలు ప్రభుత్వ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం.. పాల్గొననున్న విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు
* తాడేపల్లిగూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ… సాయంత్రం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరు
*అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి వేణు
*కాకినాడ జిల్లా తునిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి దాడిశెట్టి రాజా
*అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పరిధిలోని దొడగట్ట బీసీ కాలనీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్
*సత్య సాయి జిల్లా చిలమత్తూరు పరిధిలోని కోడూరు నుంచి విజయవాడ వరకూ నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను పరిశీలించనున్న రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్
*విజయవాడ ఏపీ ఛాంబర్స్ ఆధ్వర్యంలో ఎగుమతి ప్రాసెసర్లు, డాక్యుమెంటేషన్ పై నేడు అవగాహన సదస్సు
* రేపటి నుంచి ప్రసిద్ధ గండిపోశమ్మ ఆలయంలో భక్తులకు తిరిగి దర్శనాలు ప్రారంభం.. గోదావరి వరదల నేపథ్యంలో నాలుగు నెలలుగా దర్శనాలు నిలిపివేత
