NTV Telugu Site icon

Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

Today Events January 14, 2023

* తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయిన సంక్రాంతి సంబరాలు.. ఉత్సాహంగా భోగిమంటలు వేసిన ప్రజలు

*నేడు శ్రీశైలంలో మూడోవరోజు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. ఆలయంలో స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు

*మంత్రాలయంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నేడు స్వామి వారికి తులసి అర్చన, కనకాభిషేకం, పంచామృతాభిషేకం వంటి విశేష పూజలు….సాయంత్రం స్వామివారికి రథంపై ఉరేగింపు

*కర్నూలు జిల్లా వ్యాప్తంగా సీపీఐ నిరసన…జి ఓ నెం1 ప్రతులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేసి నిరసన

*అనంతపురం జిల్లా కుందుర్పి మండల పరిధిలోని ఎన్. వెంకటంపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి ఉషశ్రీ చరణ్

*మోహన్ బాబు యూనివర్సిటీలో వేడుకగా భోగి సంబరాలు.. భోగి మంటలు వేసిన మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులు

*నేడు సింహాద్రి అప్పన్న దేవాలయంలో సంక్రాంతి సంబరాలు..సంక్రాంతి సంబరాలను భోగి మంటలు వెలిగించి ప్రారంభించనున్న విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ..

*నేటి నుండి మూడు రోజులపాటు గుంటూరు మిర్చి యార్డుకు సెలవులు

* కడపలో భోగి మంట‌ల్లో జీవో 1ని ద‌గ్దం చేసిన అఖిల‌ప‌క్ష నేత‌లు