Site icon NTV Telugu

ఏపీలో తగ్గిన కరోనా కేసులు…

corona

corona

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా తగ్గాయి… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 46,962 శాంపిల్స్‌ పరీక్షించగా.. 909 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 13 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు. ఇక, గత 24 గంటల్లో 1,543 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారని.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 2,57,08,411కు చేరిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. తాజా కేసులతో కలుపుకుని.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,94,606కు చేరుకోగా.. కోలుకున్నవారి సంఖ్య 19,63,728కు పెరిగింది. ఇప్పటి వరకు 13,660 మంది కరోనా బాధితులు కన్నుమూస్తే.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 17,218 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి..

Exit mobile version