Site icon NTV Telugu

ఏపీ కరోనా : స్వల్పంగా పెరిగిన కేసులు..

corona

corona

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఈరోజు మళ్ళీ పెరిగింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 45,592 శాంపిల్స్‌ పరీక్షించగా.. 771 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజా టెస్ట్‌లతో కలుపుకుని.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 2,81,78,305 కు చేరింది. ఇక, మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,48,230 కి పెరగగా.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 20,22,168 కు చేరుకుంది.. మరోవైపు.. ఇప్పటి వరకు 14,150 మంది కోవిడ్‌ బాధితులు రాష్ట్రంలో మృతిచెందగా.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 11,912 గా ఉన్నాయని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.

Exit mobile version