Site icon NTV Telugu

ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు…

ఏపీలో రోజువారి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 30,747 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 184 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది… మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతిచెందరు. ఇదే సమయంలో 204 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్‌లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,06,19,555 కు చేరింది.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,74,036 కు పెరిగగా.. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కోలుకున్నవారి సంఖ్య 20,57,573 కి చేరింది.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 2,008 గా ఉంటే.. మృతుల సంఖ్య 14,455 కు పెరిగింది.

Exit mobile version