ఏపీలో కరోనా సెకండ్‌వేవ్ కల్లోలం సృష్టిస్తూనే ఉంది.. నిన్న తగ్గినట్టే తగ్గిన కొత్త కేసులు.. ఈరోజు మళ్ళీ పెరిగాయి.. తాజాగా ఏపీ సర్కార్ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 1,063 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా…11 మంది మృతి చెందారు. ఇదే సమయంలో 1,929 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,95,669 కి చేరుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,341 గా ఉంది. కోవిడ్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 13,671 కు పెరిగింది. ఇక ఏపీలో మొత్తం 19,65,657 మంది ఇప్పటి వరకు కోలుకున్నారు.
ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు…
corona