ర్యాపిడో బుక్ చేసుకున్న యువతికి చేదు అనుభవం ఎదురైంది.బ్యూటీ పార్లర్ లో పని ముగించుకుని అర్థరాత్రి టైంలో ఇంటికి వెళ్లేందుకు ఓ యువతి ర్యాపిడో బుక్ చేసుకుంది. అయితే.. ఆమె ఇంటికి వెళ్లే టైంలో ర్యాపిడో డ్రైవర్ ఆమెకు ముద్దుపెట్టి ఆమెను లైంగికంగా వేధించాడు. ఈ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: llegal Betting App Case: సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లకు ఈడీ షాక్.. రూ.11 కోట్ల ఆస్తులు జప్తు
పూర్తి వివరాల్లోకి వెళితే.. తిరుపతికి చెందిన ఓ యువతి.. బ్యూటీ పార్లర్ లో పని ముగించుకుని అర్థరాత్రి పన్నెండు గంటల టైంలో ర్యాపిడో బుక్ చేసుకుంది. అయితే. ఇంటికి వెళ్లే క్రమంలో ఆమెకు ముద్దు పెట్టి.. అసభ్యంగా ప్రవర్తిస్తూ.. లైంగికంగా వేధించాడు ర్యాపిడో డ్రైవర్. ఇంటికి చేరుకున్న ఆ మహిళ జరిగిన విషయాన్ని తన భర్తకు చెప్పింది. వెంటనే స్పందించిన భర్త ర్యాపిడో డ్రైవర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు తమకు నచ్చిన స్టైల్లో కామెంట్లు పెడుతున్నారు…ర్యాపిడో డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
