NTV Telugu Site icon

Tirupati: తిరుపతిలో మళ్లీ చిరుత కలకలం.. టీటీడీ ఉద్యోగిపై దాడి

Thirupathi

Thirupathi

తిరుపతిలో మళ్లీ చిరుత కలకలం రేపుతుంది. టీటీడీ ఉద్యోగిపై దాడికి పాల్పడింది. సైన్స్ సెంటర్ వద్ద టీటీడీ ఉద్యోగి ముని కుమార్ అనే వ్యక్తిపై చిరుత పులి దాడి చేసింది. దీంతో బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బైక్ పై వెళ్తుండగా ఒక్కసారిగా మునికుమార్ పై చిరుత దాడిచేయడంతో కిందపడ్డాడు. గుర్తించిన స్థానికులు గాయపడిన ఉద్యోగిని రుయా ఆసుపత్రికి తరలించారు. పట్టపగలే చిరుత దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Show comments