Site icon NTV Telugu

Laxmi Reddy: కిరణ్ రాయల్‌పై లక్ష్మి రెడ్డి సంచలన ఆరోపణలు

Laxmireddy

Laxmireddy

జనసేన నేత కిరణ్ రాయల్‌పై లక్ష్మిరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘మాజీ మంత్రి రోజా దగ్గర బంధువు అయినా మహిళతో కిరణ్ రాయల్‌కు అక్రమ సంబంధం ఉంది. రోజాను తిట్టిన కేసులో కిరణ్ అరెస్టు అయితే రాత్రికి రాత్రే బయటకు వచ్చాడు‌‌‌‌. దానికి కారణం రోజా దగ్గర బంధువుతో ఉన్న సంబంధమే. అ మహిళతో ఉన్న వీడియో, ఫొటోలు నా దగ్గర ఉన్నాయి. ఆ మహిళను బెదిరించే బయటకు వచ్చాడు. ఆ కారణం వల్లే గతంలో కిరణ్ రాయల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు తర్వాత వదిలేశారు.’’ అని తెలిపింది.

ఇది కూడా చదవండి: BEAUTY : మారుతీ టీమ్ ప్రొడక్ట్ నిర్మిస్తున్న ‘బ్యూటీ’ టీజర్ విడుదల

‘‘కిలాడి లేడీ అని నాపై ఆరోపణలు చేశారు. అవసరానికి వాడుకుని, అవసరం తీరాక ఆమెపై కిరణ్ రాయల్ దాడి చేశాడు. కిరణ్ రాయల్ ఏం వ్యాపారాలు చేస్తున్నాడు. భూమన అభినయ్ రెడ్డితో నాకు అక్రమ సంబంధం ఉందని చెప్పడం దారుణం. భూమన అభినయ్ రెడ్డితో నాకు ఎలాంటి సంబంధం లేదు. తిరుమల శ్రీవారి దర్శనం టికెట్‌లు అమ్ముకోవడం కిరణ్‌కే చెల్లింది‌. చెన్నై నల్లి సిల్క్స్ చీరలు తెచ్చి శ్రీవారి వస్త్రం పేరుతో అమ్ముకుని వ్యాపారం చేస్తాడు. మోసం చేయడమే కిరణ్ రాయల్‌కు తెలుసు. ఫొటోలు మార్ఫింగ్ అని చెప్పి నాపై కేసులు పెడుతున్నారు. 2.0 అని చెప్పి జగన్ మోహన్ రెడ్డి ఫొటో మార్ఫింగ్ చేసింది నిజం కాదా?, నేను పవన్ కల్యాణ్ బ్లాక్ మెయిల్ చేస్తాను.. నువ్వు ఎంత అని బెదిరించాడు. మార్ఫింగ్ కేసులో ముందు కిరణ్ రాయల్‌ను అరెస్టు చేయాలి.’’ అని లక్ష్మిరెడ్డి డిమాండ్ చేసింది.

ఇది కూడా చదవండి: Nidhhi Agerwal : బ్యూటిఫుల్ మేకోవర్ తో నిధి అగర్వాల్ ‘కొల్లగొట్టినాదిరో’

Exit mobile version