Site icon NTV Telugu

Bhumana Karunakar Reddy: నా వ్యాఖ్యలు వేరుగా వక్రీకరించారు.. నేను ఆయనకు విధేయుడినే..

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy

తన వ్యాఖ్యలు వేరుగా వక్రీకరించారని నేను ఎప్పటికి సీఎం జగన్‌కు వీర విధేయుడినని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. మహాత్మాగాంధీ ఆత్మకథ పుస్తకం సీ.ఎస్. ఎన్వీ రమణ చేతులు మీదుగా ఆవిష్కరణ చేశామన్నారు. ఈ సందర్భం గా తను చేసిన ప్రసంగాన్ని కొద్ది మంది దురుద్దేశ్యం ఆపాదించి మహాత్ములు తన జీవితంలో చెప్పిన మాటలు వేరుగా ప్రకటించి తనేదో సీఎం జగన్ పై తను మాట్లాడినట్లు వక్రీకరించడం నాకు చాలా బాధ కల్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. తను చాలా నిబద్దత కల్గిన వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ సైనికుడిని పేర్కొన్నారు.

కొద్ది మంది తనవాఖ్యలు ఆపాదించి వేరుగా వక్రీకరించడం నాకు చాలా బాధ కలిగిందని పేర్కొన్నారు. వై.ఎస్ కుటుంబంతో 48 ఏళ్లు అనుబంధం వుందని తెలిపారు. తను తీవ్రవాద రాజకీయాలు నుంచి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభావం వలనే ప్రజాస్వామ్య రాజకీయాల్లో వచ్చానని స్పష్టం చేశారు. రాజ శేఖర్ రెడ్డి, ఆయన కుటుంబానికి రాజకీయ సేవ చేసుకోవడానికే వచ్చా, ప్రజా స్వామ్య రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. మహాత్ములు అన్నటు వంటి 80 -90 ఏళ్ల క్రితం మాట్లాడిన మాటలు, నైతికత లేని రాజకీయాలు ప్రమాదకర మైనటువంటివి, పతనమైన మానవుడు అధికారంలోకి వస్తే ఒరగా బెట్టేది ఏమి లేదని అన్నారు. తన కాలంలో గాంధీజీ అన్న మాటలు స్ఫూర్తి గా తీసుకోవాలని తెలిపారు.

గాంధీ బాట లో నడవాల్సిన అవసరం ఉందని, మొత్తం మానవ జాతికి అందరికీ మహనీయుడు ఆదర్శమని, అందులో కొద్దిగా నైన ఆచరణ నేయులం ఐతే.. జీవితాలు ధన్యమని తెలిపారు. రాజకీయాలు పునీతం అవుతాయి అన్న తన మాటల్ని, మా నాయకుడు కు ఎక్కిపెట్టినట్లుగా.. వాళ్ళు ప్రసార మాధ్యమాల్లో ప్రకటించడం నిజంగా బాధ కల్గించిందని పేర్కొన్నారు. తను తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం వై.ఎస్.కుటుంబం తోనే సాగుతాను తప్ప, మా నాయకుడుకి నిబద్దత కల్గిన సైనికుడిగా ఉంటాను తప్పా, పదవులు కోసం, ప్రాపకాలు కోసమని రాజకీయాల్లో లేనని స్పష్టం చేశారు. కేవలం వై.ఎస్.కుటుంబం సేవ చేసుకోవడానికే ఈ ప్రజాస్వామ్య రాజకీయాల్లో వచ్చానని స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితం అంతా వై.ఎస్ కుటుంబం తోనే ఉంటా.. నా ఆఖరి తుది శ్వాస వరకు వై.ఎస్ కుటుంబంతో కొనసాగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Nara Lokesh: పోలీసుల అదుపులో లోకేష్‌.. టీడీపీ నేతలు ఆందోళన

Exit mobile version