Tirumala Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. ఈరోజే ఆన్లైన్లో టికెట్లు విడుదల
- నేడు తిరుమలలో ఆన్లైన్లో మార్చి నెల దర్శన టికెట్లు విడుదల..
- ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లు విడుదల..
- మధ్యాహ్నం 3గంటకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Darshan Tickets: కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి సంబంధించి మార్చి నెల ఆన్‌లైన్ టిక్కెట్ల విడుదల షెడ్యూల్‌ను టీటీడీ ప్రకటించింది. భక్తుల సౌకర్యార్థం వివిధ దర్శనాలు, సేవలకు సంబంధించిన టిక్కెట్లను దశల వారీగా ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనుంది. ఈ రోజు (డిసెంబర్ 22) ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.
Read Also: Cyber Fraud: పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కే షాక్ ఇచ్చిన సైబర్ నేరగాళ్లు.. రూ.1.62 లక్షలు వసూలు
Also Read
ఇక, రేపు ( డిసెంబర్ 23న) ఉదయం 10 గంటలకు వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక దర్శన టిక్కెట్లను టీటీడీ రిలీజ్ చేయనుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. అలాగే, మధ్యాహ్నం 3 గంటలకు అంగ ప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది టీటీడీ. కాగా, ఎల్లుండి ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు రిలీజ్ చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది టీటీడీ. ఇక, దర్శన టిక్కెట్ల కోసం భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించాలని అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!