Tirumala Rush: తిరుమలలో రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

  • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
  • కంపార్టుమెంట్లన్ని నిండిపోయి వెలుపల క్యూ లైన్ వరకు భక్తులు..
  • టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం..
Tirumala Darshanam

Tirumala Darshanam

Tirumala Rush: తిరుమలలో నేడు (ఫిబ్రవరి 21న) భక్తుల రద్దీ భారీగా ఉంది. కంపార్ట్ మెంట్లు అన్ని భక్తులతో నిండిపోయి వెలుపల వరకు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఇక, టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 6 నుంచి 7 గంటల సమయం పడుతుండగా.. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 3 నుంచి 4 గంటల టైం పడుతుంది. వసతి గృహాల కోసం కూడా గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

Read Also: Mohan Bhagwat: ఆర్ఎస్‌ఎస్‌కు అధికారం అక్కర్లేదు.. మా లక్ష్యం అది కాదన్న మోహన్ భగవత్

అయితే, క్యూ లైన్లలో ఉండే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అన్నప్రసాదం, తాగు నీటి పంపిణీ, నడక దారి భక్తులకు మార్గమధ్యంలో షెడ్ల ఏర్పాటుతో పాటు మాడ వీధులు తదితర ప్రాంతాల్లో కూల్ పెయింటింగ్ వేయనున్నట్లు తెలిపారు. ఇక, నిన్న శ్రీవారిని 68, 156 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,295 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా.. రూ. 3.46 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.