Site icon NTV Telugu

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వారికి దర్శనభాగ్యం

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభతరుణం రానేవచ్చింది. ఇవాళ 11 గంటలకు ఆన్ లైన్ లో ఏప్రిల్ మాసానికి సంబంధించిన వయోవృద్దులు, వికలాంగుల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ. నిజానికి వారం క్రితమే విడుదల చేయాల్సి వున్నా సాఫ్ట్ వేర్ సమస్యల వల్ల ఇవాళ్టికి వాయిదా పడింది. రోజుకి వెయ్యి చోప్పున టిక్కెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ.

వారిని రేపటి నుంచి దర్శనానికి అనుమతించనుంది. ఇవాళ తిరుపతిలో ఎల్లుండికి సర్వదర్శన టోకెన్లు జారీ చేయనుంది. ఎల్లుండి శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి ఆస్థానం….రాత్రి 7 గంటలకు హనుమంత వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు. 11వ తేదీ శ్రీవారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లుచేసింది. ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు రానున్నారు.

మరోవైపు రెండేళ్ళుగా భక్తులు వేయికళ్ళతో ఎదురుచూస్తున్న పుష్కరిణిలో పుణ్యస్నానాలకు టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీవారి పుష్కరిణిలోకి భక్తులను అనుమతిస్తున్న టీటీడీ. కోవిడ్ కారణంగా 2020 మార్చి 18వ తేది నుంచి భక్తులను పుష్కరిణిలోకి అనుమతించడం నిలిపివేసింది టీటీడీ.

https://ntvtelugu.com/cm-kcr-focus-on-vemulawada-and-kondagattu-temples/

రెండేళ్ళ తరువాత భక్తులకు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించే భాగ్యం కలిగించడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గురువారం భక్తులు భారీగా దర్శనానికి తరలివచ్చారు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,840 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో తలనీలాలు సమర్పించిన 34,135 మంది వున్నారు హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు అని టీటీడీ తెలిపింది.

Exit mobile version