NTV Telugu Site icon

Tirumala Brahmotsavalu: ఎల్లుండి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Tirumala Brahmotsavam 2022

Tirumala Brahmotsavam 2022

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడి కొండంత సంబరాలకు వేళయింది. తిరుమలలో ఎల్లుండి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు మాఢవీధులలో విహరించనున్నారు శ్రీవారి సర్వసేనాధిపతి విశ్వక్సేనుడు. 27వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి వార్షిక బ్రహ్మోత్సవాలు.

బ్రహ్మోత్సవాలలో ఏరోజు ఏం జరుగుతాయంటే..

* 27వ తేదీ మధ్యాహ్నం మాఢ వీధులలో గరుడ పఠం,పరివార దేవతల ఉరేగింపు

* 27 సాయంత్రం ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు

* 27వ తేదీ రాత్రి శ్రీవారికి పట్టువస్ర్తాలను సమర్పించనున్న సియం జగన్

* 27వ తేదీ రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనం

* 28వ తేదీ ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనం

* 28వ తేదీ రాత్రి 7 గంటలకు హంస వాహనం

* 29వ తేదీ ఉదయం 8 గంటలకు సింహ వాహనం

* 29వ తేదీ రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం

* 30వ తేదీ ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనం

* రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనం

* 1వ తేదీ ఉదయం మోహిని అవతారం

* రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ

* 2వ తేదీ ఉదయం 8 గంటలకు హనుమంత వాహన సేవ

* 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు స్వర్ణరథం..రాత్రి 7 గంటలకు గజవాహనం

* 3వ తేదీ ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం..రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం

* 4వ తేదీ ఉదయం 6 గంటలకు రథోత్సవం..రాత్రి 7 గంటలకు అశ్వవాహనం

* 5వ తేదీ ఉదయం 6 గంటలకు చక్రస్నానం..రాత్రి ధ్వజాఅవరోహనంతో ముగియనున్నాయి స్వామివారి బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. భక్తులు భారీగా హాజరయ్యే అవకాశం వుండడంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

Read Also:Tirumala Brahmotsavalu Security: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు