Site icon NTV Telugu

Tirumala: రెండో ఘాట్రోడ్డులో డివైడర్‌ను ఢీకొన్న బస్సు.. భక్తులకు గాయాలు

Thirumal Accident

Thirumal Accident

తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. రెండో ఘాట్ రోడ్డులో భక్తులతో వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. హరిణి దాటిన తరువాత డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో.. బస్సు రోడ్డుకు అడ్డంగా ఉండిపోయింది. క్రాష్ బారియర్ పటిష్టంగా ఉండటంతో బస్సు రోడ్డు పైనే నిలిచిపోయింది. లేకుంటే పక్కనే ఉన్న లోయలోకి బస్సు జారిపడే అవకాశం ఉండేది. అదృష్టవశాత్తు అలాంటి ప్రమాదం జరగకపోవంతో బస్సులో ప్రయాణిస్తున్న భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు.. ఈ ప్రమాదంలో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. బస్సు రోడ్డుకు అడ్డంగా ఉండటంతో.. అలిపిరి వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. క్రేన్ సహయంతో బస్సుని తొలగించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. తిరుమలకు ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.

Exit mobile version