Ratha Saptami in Tirumala: శ్రీవారి వార్షిక రథసప్తమి వేడుకలతో తిరుమల శోభాయమానంగా మారింది. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పేర్కోనే రథసప్తమి పర్వదినం రోజున శ్రీవారు ఏడు వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులుకు దర్శనమిస్తారు. ఏటా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా 9 రోజులలో శ్రీవారు 16 వాహనాలపై మాడ వీధులలో విహరిస్తూ భక్తులుకు దర్శనమిస్తే… రథ సమప్తమి పర్వదినం రోజున ఒక్కే రోజు శ్రీవారు ఏడు వాహనాలపై మాడ వీధులలో విహరిస్తూ భక్తులుకు దర్శనమిస్తారు.
Read Also: Off The Record: ఈటల టార్గెట్‌గా సోషల్ మీడియాలో ప్రచారం..! పావులు కదుపుతున్నారా..?
సకల జీవకోటికి వెలుగు ప్రదాత.. చైతన్య కారకుడైన సూర్యభగవానుడు జనులకు ప్రత్యక్ష నారాయణుడు.. ఆ ఆదిత్యుని జన్మదినమైన సూర్యజయంతి రోజున రథసప్తమి వేడుకలును టీటీడీ నిర్వహించడం ఆనవాయితి. ఇవాళ సూర్యోదయాన సుర్యప్రభ వాహనంతో ప్రారంభమైన గోవిందుడి వాహన సంరంభం రాత్రికి జరిగే చంద్రప్రభ వాహనంతో ముగియనున్నది. శ్రీనివాసుడు ఒక్క రోజే సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల,చంద్రప్రభ వాహనాలపై మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు.
ఉదయం ఐదున్న గంటలకే సూర్యప్రభ వాహన సేవతో స్వామివారి వాహన సేవలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6 గంటల 44 నిమిషాలకు మలయప్పస్వామి పాదాలపై సూర్యకిరణాలు ప్రసరిస్తాయని ముహుర్తూం నిర్ణయించారు పండితులు. భక్తులకు ప్రతి గంటకు గ్యాలరీల వద్దకే అన్నపానీయాలు అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ అధికారులు. మాడవీధులో 200 గ్యాలరీలు ఏర్పాటు చెయ్యగా.. 65 ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేసింది. రథసప్తమి పర్వదినం సందర్భముగా ప్రత్యేక దర్శనాలతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలును ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ..
* ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సప్త వాహన సేవలు..
* ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనసేవ
* ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనసేవ
* ఉదయం 11 గంటలకు గరుడ వాహనసేవ
* మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనసేవ
* మధ్యాహ్నం 2 గంటలకు చక్రస్నానం
* సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహన సేవ
* సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహన సేవ
* రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవ..