Janga Krishnamurthy Resignation: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలకమండలి సభ్యత్వానికి బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు.. దీనికి ప్రధాన కారణం స్థల వివాదంగా తెలుస్తోంది… 2005లో టీటీడీ తనకు కేటాయించిన 500 గజాల స్థల వివాదమే కారణంగా చెబుతున్నారు.. 2005లో జంగా కృష్ణమూర్తికి తిరుమల బాలాజీ నగర్‌లో ప్లాట్ నం.2ను డొనేషన్ స్కీమ్ కింద కేటాయించింది టీటీడీ.. 31 జూలై 2005న టీటీడీ బోర్డు తీర్మానం ద్వారా గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్లాట్ కేటాయించారు.. అయితే, 2006లో నిబంధనలు పాటించలేదన్న కారణంతో ప్లాట్ కేటాయింపు రద్దు చేసింది.. కానీ, 2008లో డొనేషన్ చెల్లింపుకు గడువు పెంచాలని జంగా విజ్ఞప్తి చేశారు.. జంగా కట్టిన 10 లక్షల రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ (DD) 2008లో టీటీడీకి చెల్లింపు కాగా.. 21 అక్టోబర్ 2008న జీవో నెం.1220 జారీ అయ్యింది.. ఈ నేపథ్యంలో ప్రత్యేక కేసుగా పరిగణించి మళ్లీ ప్లాట్ కేటాయింపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. 2009లో హైకోర్టును ఆశ్రయించారు జంగా కృష్ణమూర్తి.. 2009లో పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎనిమిది వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని 2009లో ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.. ఆ మేరకు ఇటీవల జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో జంగాకు స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు..
కానీ, దీనిపై విమర్శలు రావడం తో రద్దు చేయాలని నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయానికి వచ్చారు.. అయిదే, దీనిపై జంగా కృష్ణమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు.. టీడీపీ పాలకమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు.. సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు టీటీడీ చైర్మన్ కి రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపించారట.. తిరుమలలో స్థల కేటాయింపు వ్యవహారంపై మనస్థాపానికి గురైన ఆయన.. ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.. అయితే, జంగా రాజీనామాను ఆమోదించే దిశగా టీటీడీ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
