Site icon NTV Telugu

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన.. తిరుమలలో విచారణ కమిటీ ఆరా..

Tirupati Stampede

Tirupati Stampede

Tirupati Stampede: తిరుమలలో వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతి తొక్కిసలాట కలకలం సృష్టించింది.. ఈ ఘటనపై విచారణ కమిటీ చైర్మన్‌గా నియమితులైన రిటైర్డ్ జడ్జి, జస్టిస్ సత్యనారాయణమూర్తి ఇవాళ తిరుమలలో పరిశీలన జరిపారు. ఇప్పటికే ఘటనపై విచారణ ప్రారంభించిన జస్టిస్ సత్యనారాయణమూర్తి.. ఇప్పటి వరకు తిరుపతిలో ఘటన జరిగిన ప్రాంతాన్ని, బాధితులను, సాక్షులను, అధికారులను స్వయంగా విచారించగా.. తాజాగా, తిరుమలలో ఉన్న వ్యవస్థను స్వయంగా పరిశీలన జరిపారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులను క్యూలైన్లలో దర్శనానికి అనుమతించే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.. ముందుగా నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్ల వద్దకు చేరుకున్న ఆయన.. అటు తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లను పరిశీలన జరిపారు. మరోవైపు టీటీడీ అధికారులు, విజిలెన్స్ సిబ్బందితో భక్తులను క్యూలైన్లలో అనుమతించే విధానానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక సీసీ కెమెరాలు ఉండే కమాండ్ కంట్రోల్ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. మరోవైపు రెండు రోజులపాటు తిరుమలలో పరిశీలన జరిపి 17వ తేదీ నుంచి తిరుపతిలో ఉన్నతాధికారులను నుంచి వివరాలు సేకరించనున్నారు రిటైర్డ్ జస్టిస్. 17వ తేదీన జిల్లా కలెక్టర్‌ని, 18వ తేదీన టీటీడీ ఈవో, తిరుపతి ఎస్పీ స్వయంగా హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు విచారణ కమిటీ చైర్మన్ సత్యనారాయణ మూర్తి..

Read Also: CM Revanth Reddy: బీఆర్ఎస్ వాళ్లకు గవర్నర్, మహిళల పట్ల గౌరవం లేదు..

Exit mobile version