NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: తిరుమలలో పవన్‌ కల్యాణ్‌ దీక్ష విరమణ

Pawan

Pawan

Deputy CM Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.. ఇక, ఉదయం శ్రీవారిని దర్శించుకోని ప్రాయశ్చిత దీక్షను విరమించనున్నారు పవన్‌ కల్యాణ్‌.. దర్శనాంతరం నేరుగా తరిగొండ అన్నప్రసాద సముదాయానికి చేరుకోనున్న పవన్ కళ్యాణ్.. అక్కడ అన్నప్రసాద సముదాయంలో అన్నప్రసాదాల తయారిని పరిశీలించనున్నారు.. అన్నప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు.. అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదాని స్వీకరించనున్నారు.. ఇక, లడ్డూ ప్రసాదం తయారు చేసే బూందీ పోటుని కూడా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పరిశీలించే అవకాశం ఉంది..

Read Also: Iran Israel War: విజయం దగ్గర్లోనే ఉంది.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ!

కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంగా మారిన నేపథ్యంలో.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం విదితమే.. తిరుమల శ్రీవారిని దర్శించుకుని 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు ఇప్పటికే ఆయన తిరుమల చేరుకున్నారు.. మంగళవారం రాత్రి అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.. నడక మార్గంలో భక్తులను పలకరిస్తూ ముందుకు సాగారు.. మొత్తంగా తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని, ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ రోజు దీక్ష విరమించనున్నారు.. కాగా, తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగిన విషయం విదితమే..