NTV Telugu Site icon

Suryalanka: సూర్యలంక తీరంలో విషాదం.. ముగ్గురు మృతి

Suryalanka

Suryalanka

Suryalanka: బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీర ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వచ్చి ముగ్గురు యువకులు మృతి చెందారు. మరో ముగ్గురు గల్లంతు అయ్యినట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం జాలర్లతో కలిసి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బాధితులు విజయవాడ సింగ్ నగర్‌కు చెందిన విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు.

Read Also: Y. S. Sharmila: మరోసారి ఫైర్.. పండిత పుత్ర పరమ శుంఠ అని మీనాన్నే చెప్పారు నేను చెబుతే తప్పా?

కాగా సూర్యలంక తీర ప్రాంతాన్ని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. విజయవాడ నుంచి వచ్చిన యువకులు సూర్యలంక తీరంలో మృతి చెందడం బాధాకరమని ఆయన తెలిపారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు గల్లంతయ్యారని.. ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయని వెల్లడించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. సాగర తీరానికి వచ్చేవాళ్లు అత్యంత అప్రమత్తతతో ఉండాలని సూచించారు. నిర్దేశించిన ప్రాంతం దాటి సముద్రం లోపలికు వెళ్లడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు.