తూర్పు గోదావరి జిల్లాలో ఒమిక్రాన్ వేరియంట్ కలకలం సృష్టిస్తోంది.. జిల్లాలో మూడు ఒమిక్రాన్ అనుమానిత కేసులు నమోదు అయినట్టు అధికారులు చెబుతున్నారు.. బంగ్లాదేశ్ వెళ్లొచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్, సింగపూర్ నుంచి వచ్చిన దంపతులకు ఒమిక్రాన్‌గా అనుమిస్తున్నారు.. అయినవల్లి (మం) సిరిపల్లిలో యువకుడిని, రావులపాలెం (మం) గోపాలపురంలో భార్య,భర్తలను ఐసొలేషన్‌లో ఉంచారు అధికారులు.. ఇప్పటి వరకూ ఎవరికీ ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదు.. ముగ్గురు శ్యాంపిల్స్ హైదరాబాద్ పంపించాం.. ఫలితాలు హైదరాబాద్ జీనోమ్ ల్యాబ్ నుంచి మూడు నుంచి ఐదు రోజుల్లో వస్తాయని వెల్లడించారు అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ బి. మీనాక్షి..
Read Also: ఒమిక్రాన్‌తో ఆందోళన వద్దు.. ఇలా చేయండి..!
మరోవైపు.. చైనా, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా సహా 12 దేశాల నుంచి వచ్చిన వారిని ఒమిక్రాన్ హైరిస్క్ గా పరిగణిస్తున్నాం.. డిసెంబర్ 1వ తేదీ నుంచి జిల్లాకు 2,743 మంది వివిధ దేశాల నుంచి వచ్చారని తెలిపారు డాక్టర్ మీనాక్షి.. ఎయిర్‌పోర్ట్‌లో నెగిటివ్ వచ్చినా నిబంధనల ప్రకారం ఎనిమిదో రోజు మరోసారి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్న ఆమె.. జిల్లాకు ఇప్పటి వరకూ విదేశాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురికి ఎనిమిదో రోజు తర్వాత పాజిటివ్ రావటంతో ఒమిక్రాన్‌గా అనుమానం ఉందన్నారు.. ముగ్గురి శ్యాంపిల్స్ కొరియర్ ద్వారా హైదరాబాద్ జీనోమ్ ల్యాబ్ కు పంపించామని.. త్వరలోనే అది తేలిపోతుందన్నారు. కాగా, ఇవాళ తెలంగాణలో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే.. ఏపీలోనూ గతంలో ఒక ఒమిక్రాన్ కేసు వెలుగు చూసినా.. ఆయనకు పాజిటివ్‌గా రిపోర్టు వచ్చేసరికే.. కోలుకున్న సంగతి తెలిసిందే.