NTV Telugu Site icon

Telugu States: రేపే త్రిసభ్య కమిటీ తొలి భేటీ.. వీటిపైనే ఫోకస్..

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య పరిష్కారానికి నోచుకోని విభజన సమస్యలపై చర్చల కోసం ఏర్పాటైన త్రిసభ్య కమిటీ తొలి సమావేశం జరగబోతోంది… కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ తొలి సమావేశం రేపు ఉదయం 11 గంటలకు వర్చువల్‌గా జరగనుంది.. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అధ్యక్షత జరిగే ఈ సమాశానికి.. త్రిసభ్య కమిటీలో సభ్యులుగా ఉన్న ఏపీ, తెలంగాణ సీఎస్‌లు పాల్గొననున్నారు.. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు..

Read Also: Vijayawada Woman: ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన మహిళ జైలుకు..

అయితే, ఈ సమావేశం అజెండాలో మొదట 9 అంశాలను చేరుస్తూ అజెండాను రూపొందించిన కేంద్ర హోంశాఖ.. ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని అజెండా నుంచి తొలగించింది.. అంతే కాదు.. మరో మూడు అంశాలను కూడా అజెండా నుంచి మాయం అయిపోయాయి.. అయితే, త్రిసభ్య కమిటీ సమావేశం అజెండాలో మొదట ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించడంపై అధికార వైసీపీ నేతలు స్వాగతించారు.. ఆ తర్వాత తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. ఈ వ్యవహారంలో.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఆరోపణలు, విమర్శల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.. మొత్తంగా రేపటి సమావేశం.. ఏపీఎస్‌ఎఫ్‌సీ విభజన, రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ సమస్యలు, పన్నుల వ్యవహారం, వనరు వ్యత్యాసాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి గ్రాంట్‌పై చర్చ జరగబోతోంది.. మరోవైపు.. కేంద్రం దృష్టికితాము తీసుకెళ్లిన సమస్యల్లో ఒక్కటికూడా అజెండాలో లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది తెలంగాణ సర్కార్. ఇక, తొలి సమావేశంలో ఎలాంటి చర్చ జరగనుంది.. సమస్యలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? అనేది మాత్రం వేచిచూడాల్సిన విషయమే.