NTV Telugu Site icon

Minister Dharmana: మళ్లీ అవకాశమివ్వమంటున్నారు.. 14 ఏళ్లల్లో ఏమీ చేశారు చంద్రబాబు

Minister Dharmana

Minister Dharmana

Minister Dharmana: ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడపై ఫైర్‌ అయ్యారు. తను మళ్లీ ఒక అవకాశమివ్వాలని ప్రజలను అడుగుతున్నారని.. ఆయన ముఖ్యమంత్రిగా 14 ఏళ్లల్లో ఏమీ చేశారో చెప్పాలని ధర్మాన ప్రశ్నించారు. అవకాశం ఇచ్చినప్పుడు ఏమీ చేయకుండా.. మళ్లీ ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నావా? అని ప్రశ్నించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు.

Read also: Vijay Devarakonda : చిరంజీవి గారు ఒక లెజెండ్.. ఆయన ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు..

బాబు, కొడుకు ఊరుమీదపడి తిరుగుతున్నారని.. అవకాశం ఇవ్వండని ప్రజలను వేడుకుంటున్నారని ధర్మాన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నయాపైసా అవినీతి లేని పరిపాలనను తాము అందిస్తున్నామని ధర్మాన స్పష్టం చేశారు. రాష్ట్ర పరిపాలనలో వచ్చిన మార్పు ఇదేనని చెప్పారు. చంద్రబాబు తన పరిపాలనలో సమాజంలో ఫలానా మార్పు చేశానని చెప్పాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 4 సంవత్సరాలల్లోనే శ్రీకాకుళం పట్టణానికి 40 పనులు చేశారని.. కానీ చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఏమీ చేశాడో చెప్పాలన్నారు. నాడు టీడీపీ హయాంలో మార్కెట్‌ అభివృద్ధి లేదన్నారు. బుట్టలు తన్నేయడం తప్ప. తట్టడు మట్టివేయలేదని ధర్మాన విమర్శించారు. తాము మూలపేట పోర్ట్ పనులను రూ. 4000 కోట్లతో చేస్తున్నామని చెప్పారు. మరో రూ. 800 కోట్లతో ఉద్ధానం ప్రాంతం 7 మండలాలకు త్రాగునీరు అందిస్తున్నామని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. అలాగే రూ. 200 కోట్లతో కిడ్ని రీసెర్చ్ హాస్పిటల్‌ పలాసలో కట్టామని చెప్పారు. ఇలా ఆయన చేసిన పనులను చంద్రబాబు నాయుడు ఎలాగూ చెప్పలేడని.. కనీసం అచ్చెంనాయుడుగానీ, రామ్మోహన్‌ నాయుడు చెప్పాలని ధర్మాన ప్రశ్నించారు. ఏ పనులు చేయకుండా నేడు ఉత్తరాంధ్రను ఉద్ధరించానని చంద్రబాబు చెబుతున్నాడని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని నాశనం చేసింది.. సఫా చేసింది టీడీపీయేనని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.