Site icon NTV Telugu

HRA , CCA, ఇతర సౌకర్యాలను యథాతథంగా కొనసాగించాలి: ఏపీ ఉద్యోగ సంఘాలు


HRA , CCA, పెన్షనర్లకు ఇచ్చే అదనపు పెన్షన్ సౌకర్యాలను యధాతథంగా కొనసాగించాలని ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. దీనిపై వారు మాట్లాడారు. ఇప్పటికే సచివాలయంలో సీఎస్‌ సమీర్‌ శర్మను కలిసిన జేఏసీ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావుతో పాటు ఇతర నేతలు ఉన్నారు. తమ డిమాండ్లను సీఎస్‌కు చెప్పారు. కాగా అమరావతి ఐక్యవేదిక నుంచి నేతలు వినతిపత్రం సమర్పించారు.

Read Also: రైతు కష్టం తెలిసిన సీఎం కేసీఆర్‌: నామా నాగేశ్వరరావు

ఉద్యోగులకు 70, 75 ఏళ్లకు ప్రభుత్వం చెల్లిస్తున్న అదనపు పెన్షన్ 10% ,15% శాతం సౌకర్యాలను తగ్గించకూడదని నేతలు సీఎస్‌ను కోరారు. పీఆర్సీ ప్రకటించిన నేపథ్యంలో హెచ్ఆర్ఏ అంశం పై సీఎంఓ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎంఓ అధికారులతో వేర్వేరుగా భేటీ అయిన సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, జేఏసీ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాస రావు ఇతర నేతలు ఉన్నారు.

Exit mobile version