Site icon NTV Telugu

14 నెలల్లో ప్లాంట్‌ ప్రారంభం ఓ మైలురాయి: సీఎం జగన్‌

శ్రీ సిటీలో నోవా ఎయిర్‌ ప్లాంట్‌ను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ ప్లాంట్‌లో మెడికల్‌, లిక్విడ్‌ ఆక్సిజన్‌, లిక్విడ్‌ నైట్రోజన్‌, లిక్విడ్‌ ఆర్గోన్‌ వాయువుల తయారీ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో నోవా ఎయిర్‌ ఎండీ గజనన్‌నబర్‌, కమర్షియల్‌ హెడ్‌ శరద్‌ మధోక్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడారు. రోజుకు220 టన్నుల ఆక్సిజన్‌ తయారీ ఉత్పత్తి చేయడం ఈ ప్లాంట్‌ ఉద్దేశమన్నారు. కేవలం 14 నెలల్లో ప్లాంట్‌ ప్రారంభం కావడం అన్నది ఓ మైలురాయి అని జగన్‌ అన్నారు. ఇంత తక్కువ వ్యవధిలో ప్లాంట్‌ ప్రారంభం కావడం ఒక విశేషమన్నారు.దీంతో నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. 144 పీఎస్‌ఏ ప్లాంట్లు కూడా వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటికే పెట్టామన్నారు. మరో 32 ప్లాంట్లు కూడా పెడుతున్నామన్నారు. దీనివల్ల ఆక్సిజన్‌ విషయంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని సీఎం జగన్‌ తెలిపారు. 24వేల ఆక్సిజన్‌ బెడ్లను సిద్ధం చేశామన్నారు. కోవిడ్‌ లాంటి విపత్తులు వచ్చినప్పుడు సరిపడా ఆక్సిజన్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 300 టన్నుల ఆక్సిజన్‌ తయారు అవుతుందన్నారు.ఈ ప్లాంట్‌ ద్వారా ఉత్పత్తి దీనికి అదనంగా వచ్చి చేరుతుందని సీఎం పేర్కొన్నారు.

Read Also: ఉద్యోగుల ఆందోళనలకు, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధం లేదు: విజయ్‌కుమార్‌

కోవిడ్‌కే కాదు, పరిశ్రమలకూ ఆక్సిజన్‌ చాలా ముఖ్యం: గజనన్‌ నబర్‌, నోవా ఎయిర్‌ ఎండీ
దేశంలో తొలిసారిగా ప్లాంట్‌ పెట్టామని ఎయిర్‌ ఎండీ, గజనన్‌ నబర్‌ అన్నారు. ఏపీ సరైన ప్రాంతమని ఎంచుకుని ఈ ప్లాంట్‌ను పెట్టామని తెలిపారు.మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయి.14 నెలల్లో ప్లాంట్‌ను నిర్మించామన్నారు. అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ప్లాంట్‌ నిర్మాణానికి సహకరించారని వెల్లడించారు. కోవిడ్‌ వేవ్‌ల సమయంలో రవాణాకు, మానవవనరులకు కొరతలేకుండా అధికారులు చూశారన్నారు.

అందరీకీ కృతజ్ఞతలు అని గజనన్‌ అన్నారు. శ్రీ సిటీలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. గ్యాసెస్‌ తయారీలో మాకు అపారమైన అనుభవం ఉందన్నారు.అత్యాధునిక టెక్నాలజీని తీసుకు వచ్చాం. ఇండస్ట్రియల్‌ గ్యాసెస్‌ అందుబాటులో ఉండడంవల్ల సంబంధిత పరిశ్రమలకు మేలు జరుగుతుంది. పారిశ్రామికాభివృద్ధి కూడా జరుగుతుంది. అత్యంత భద్రతా ప్రమానాలో ప్లాంట ఏర్పాటు చేశామన్నారు. 1000 టన్నుల ఆక్సిజన్‌ స్టోరేజీకి కూడా ప్లాంట్‌లో ఏర్పాట్లు చేశామని గజనన్ నబర్‌ పేర్కొన్నారు.

Exit mobile version