NTV Telugu Site icon

వ్యాపారి రాహుల్ హత్యకేసులో ప్ర‌ధాన నిందితుడు ఆరెస్ట్‌….

ఈ నెల 19 వ తేదీన వ్యాపారి రాహుల్ త‌న కారులోనే శ‌వ‌మై కనిపించాడు.  అయితే, అత‌డు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా లేదంటే ఎవ‌రైనా హ‌త్య‌చేశారా అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేశారు.  అక్క‌డ దొరికిన ఆధారాల‌ను బ‌ట్టి రాహుల్‌ను హ‌త్య‌చేశార‌నే నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన పోలీసులు ఆ దిశ‌గా ద‌ర్యాప్తును వేగ‌వంతం చేశారు.  ఇప్ప‌టికే ఆరుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచార‌ణ చేస్తున్నారు పోలీసులు.  ఇదిలా ఉంటే, రాహుల్‌ను హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడైన కోరాడ విజ‌య్ కుమార్ ఈరోజు మాచ‌వ‌రం పీఎస్ లో లొంగిపోయాడు. ప్ర‌ధాన నిందితుడు రాహుల్‌ను పోలీసులు ర‌హ‌స్య‌ప్రాంతంలో విచారిస్తున్నారు.  ఈ కేసులో ఏ1 గా కోరాడ విజ‌య్‌, ఏ2గా ప‌ద్మజ‌, ఏ3 గా గాయ‌త్రి, ఏ 4 గా కోగంటి స‌త్యం పేర్ల‌ను పోలీసులు న‌మోదు చేశారు.  

Read: కాబూల్ విమానాశ్ర‌యం వ‌ద్ద మ‌ళ్లీ ఉద్రిక్త‌త‌…కాల్పులు… ఏడుగురు మృతి…