Site icon NTV Telugu

ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు ఆగ్రహం

ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలు వెబ్‌సైట్‌లో ఎందుకు అప్‌లోడ్‌ చేయడం లేదని కోర్టు ప్రశ్నించింది. జీవోల్లో ఐదు శాతమే సైట్‌లో ఉంచుతున్నారని న్యాయవాది బాలాజీ తెలిపారు. కాగా ఇది సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకమని ఆయన కోర్టుకు తెలిపారు.

https://ntvtelugu.com/tdp-leader-yanamala-fires-on-ots-scheme/

అయితే కొన్ని రహస్య జీవోలే అప్‌లోడ్‌ చేయడం లేదని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా అన్ని జీవోల వివరాలను వెంటనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఏపీలో చాలా వరకు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేయడం లేదని పిటిషనర్‌ పేర్కొన్నారు. దీంతో కోర్టు అన్ని జీవోలను పొందు పర్చాలని, ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కు ఉందని కోర్టు తెలిపింది.

Exit mobile version