ఏపీలో పీఆర్సీ రగడ ఇప్పట్లో తేలేలా లేదు. ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వనించినప్పటీకి వారు రాలేదు. దీంతో మంత్రుల కమిటీ వెనుదిరిగింది. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం మా డిమాండ్‌లు నేరవేర్చడంతో పాటు తాము పెట్టే షరతులకు ఒప్పుకుంటేనే చర్చలకు వస్తామని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించే అంశంతో పాటు వారిని దారికి తెచ్చేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ట్రెజరీ ఉద్యోగులు, డీడీవోలకు ప్రభుత్వం మెమోలు జారీ చేసింది.
Read Also: రేపటి నుంచి బీజేపీ మైక్రో డొనేషన్స్ ప్రారంభం
తక్షణమే ఉద్యోగుల జీతాల ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించింది. లేదంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వానికి పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. పీఆర్సీపై ఉద్యమంలో భాగంగా వేతన, ఇతర ప్రభుత్వ బిల్లులను.. ప్రాసెస్ చేసేదిలేదని పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. తాము కూడా ఉద్యమంలో పాల్గొంటున్నామని ట్రెజరీ డైరెక్టర్‌కి ఉద్యోగులు లేఖ రాశారు. తమపై ఒత్తిడి తీసుకురావద్దని పే అండ్ ఎకౌంట్స్ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది.
