అనంతపురం జిల్లాలో దుర్ఘటన చోటు చేసుకుంది. తన పోలికలతో లేదని ఓ వ్యక్తి తనకు పుట్టిన శిశువు ప్రాణాలను బలిగొన్నాడు. ఈ హృదయవిదాకర ఘటన అనంతపురం జిల్లాలోని కళ్యాణ దుర్గంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కళ్యాణ దుర్గంలో నివాసం ఉంటున్న మల్లికార్జున్ కు రెండు నెలల క్రితం పాప పుట్టింది. అయితే పాపకు తన పోలికలు లేవని తరుచూ భార్యతో మల్లికార్జున్ గొడవు దిగేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి భార్యతో గొడవపడి రెండు నెలల పాపను తీసుకోని పరారయ్యాడు. దీంతో వెంటనే భార్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాప ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం పోలీసులకు ఓ సంచిలో పాప మృతదేహం దొరికింది. పాప నోటికి ప్లాస్టర్ వేసి ఉండడంతో ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పాప మృతి చెందిన విషయం తెలిసిన తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.