తిరుపతి కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ బీజేపీ, టీడీపీ, వైసీపీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత భూభాగంలోకి చైనా చొచ్చుకువస్తున్నా దేశ ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదని.. దేశం ప్రమాదపు అంచుల్లో ఉందన్నారు. ప్రధాని అత్యంత ఆప్తుడి పోర్టులో రూ. 20 కోట్ల విలువ చేసే హెరాయిన్ దొరికితే అతన్ని అరెస్టు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లీటర్ డీజిల్ పై రూ. 50 ఉంటే, బీజేపీ హయాంలో రూ.100కుపైనే ఉందన్న ఆయన.. దేశంలో అభివృద్ధి శూన్యం, దేశం అప్పుల్లో కూరుకు పోతుందని ప్రభుత్వ సంస్థలన్నింటినీ అమ్మకానికి పెడుతున్నారన్నారని ఆరోపించారు.
ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ఇంకా అధ్వానంగా మారాయని, పట్టాభి ముఖ్యమంత్రిని అనటం సబబు కాదు. దాన్ని సమర్థించడం చంద్రబాబు పొరపాటని చింత మోహన్ అన్నారు. దీక్ష చేయడం ఎందుకు, 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు.. సీఎం పీఠం పై చంద్రబాబుకు ఇంకా ఆశ తగ్గలేదని.. అమిత్ షా మిమ్మల్ని ఆదరించడు ఎందుకు వెళ్లటమని కామెంట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ పిల్లలు చదువుకోవటానికి రెండేళ్ల నుంచి మీరు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం లేదని ఈ డబ్బునంతా సీఎం జగన్ ఎక్కడి తరలిస్తున్నారు చెప్పాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు.