NTV Telugu Site icon

Constable Fell Down on Road: ఫుల్‌గా మందు కొట్టి రోడ్డుపై పడిపోయిన కానిస్టేబుల్‌.. ఆస్పత్రిలో రచ్చ..

Constable

Constable

Constable Fell Down on Road: అతిగా మద్యం సేవించి ఆ మత్తులో రోడ్డుపైనే పడికుండి పోయాడు హెడ్ కానిస్టేబుల్‌.. అయితే, పోలీసు డ్రడ్స్‌లో ఉండడంతో.. అది గమనించిన స్థానికులు 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటన కృష్ణజిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది.. స్థానిక రామానాయుడు పేటలో యూనిఫామ్‌ ధరించిన వ్యక్తి తప్పతాగి రోడ్డు పక్కన స్పృహ కోల్పోయి అపస్మారక స్దితిలో పడిపోయాడు.. అతిగా మద్యం సేవించి ఉండటంతో స్పృహ రాకపోవడంతో 108కు సమాచారం ఇచ్చారు.. 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని అతడిని మచిలీపట్నం ప్రభుత్వసుపత్రికి తరలించారు.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.. యూనిఫామ్‌లో ఉన్న వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ శివకుమార్ గా గుర్తించారు.. శివకుమార్ ప్రస్తుతం విజయవాడలో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తుంది.. ఇక, ఆస్పత్రిలో చేరిన తర్వాత శివకుమార్‌ రచ్చ మరోలా ఉంది.. ఆస్పత్రి బెడ్‌పై పడుకోకుండా.. ఓ సారి ఆస్పత్రి బెడ్‌ కింద దూరినట్టు ఆ దృశ్యాలను చూస్తే తెలుస్తోంది.. మరోసారి.. బెడ్‌పై నుంచి కింద పడిపోయారు శివకుమార్‌.. ఏదేమైనా.. ప్రజలను సక్రమ మార్గంలో నడపాల్సినవాళ్లు.. తప్పుచేస్తే.. శిక్షించాల్సినవాళ్లు.. ఇలా తాగి రోడ్డుపై పడి.. అబాసుపాలు అవుతున్నారు.

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌