సంచలనం సృష్టించిన రింగు వలలపై ఘటనపై అధికారులు, మత్స్యకారులతో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చల్లో ఎలాలంటి నిర్ణయాన్ని అధికారులు తీసుకోలేకపోయారు. దీంతో మత్స్యకారులతో అధికారుల సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ఇరు వర్గాల మత్స్యకార గ్రామాల పెద్దలతో చర్చలు జరిపిన జిల్లా ఉన్నతాధికారులు. ఈనెల 25వ తేదీన మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. ఈలోగా ఏదో ఒక నిర్ణయానికి రావాలని మత్స్యకారులను అధికారులు కోరారు.తమ తమ గ్రామ పెద్దలతో చర్చించి 25 లోగా తమ నిర్ణయం తెలుపుతామని మత్స్యకారులు అధికారులకు తెలిపారు. మత్స్య కారులు తమ నిర్ణయం తెలపని పక్షంలో రూల్స్ ప్రకారం వెళ్తామని అధికారులు వెల్లడించారు. అప్పటివరకు యథావిధిగా కొనసాగనున్న చేపల వేటను కొనసాగించుకోవచ్చని అధికారులు తెలిపారు.
Read Also: రేపు సీఎస్‌కు యాక్షన్ నోటీసు: ఉద్యోగ సంఘాలు
