ఏపీ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున తగ్గించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కాలంగా లీటర్ పెట్రోల్ పై రూ.36, డీజిల్ పై రూ.25 చొప్పున పెంచిందన్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ పై రూ.10 తగ్గించిందని, తెలంగాణతో సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాయని ఆయన పేర్కొన్నారు.
కేంద్రం ఇప్పుడు లీటర్ పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 తగ్గిస్తున్నట్టు ప్రకటించటం కంటి తుడుపు చర్యలే తప్ప శాశ్వత పరిష్కారం కాదని ఆయన తెలిపారు. ధరలు పెంచుతూ పేదల నడ్డి విరగొట్టడమే పనిగా పెట్టుకుందని కేంద్రప్రభుత్వం పై రామకృష్ణ విమర్శలు గుప్పించారు. మోడీ ప్రభుత్వం ఏడాదిన్నర కాలంగా ఇబ్బడిముబ్బడిగా పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పూర్తిగా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామని రామకృష్ణ అన్నారు.
